Hari Hara Veera Mallu Trailer: తెరపై కల్యాణ్‌బాబు ఫైర్‌.. ట్రైలర్‌పై చిరు రివ్యూ

Hari Hara Veera Mallu Trailer: తెరపై కల్యాణ్‌బాబు ఫైర్‌.. ట్రైలర్‌పై చిరు రివ్యూ
x

Hari Hara Veera Mallu Trailer: తెరపై కల్యాణ్‌బాబు ఫైర్‌.. ట్రైలర్‌పై చిరు రివ్యూ

Highlights

పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు తాజాగా మరో కీలక మైలురాయిని చేరింది. దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి రూపుదిద్దించిన ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hari Hara Veera Mallu Trailer: పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు తాజాగా మరో కీలక మైలురాయిని చేరింది. దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి రూపుదిద్దించిన ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతోన్న సమయంలో చిత్ర బృందం గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ చూసిన మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ అభినందనలు తెలిపారు.

“హరి హర వీరమల్లు ట్రైలర్ ఎనర్జిటిక్‌గా ఉంది. రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత కల్యాణ్‌బాబు వస్తున్న ఈ సినిమా థియేటర్లను శబ్దంతో నిండబోతోంది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అంటూ చిరు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే, రామ్‌చరణ్‌ కూడా స్పందిస్తూ, “ట్రైలర్ ఎంతగా ఆకట్టుకుందో చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోంది. పవన్‌ కల్యాణ్‌ మంచి వినోదాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు” అని ట్వీట్ చేశారు. మెగా హీరోల నుంచి వచ్చిన ఈ మెసేజ్‌లకు చిత్ర బృందం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది.

ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. పవన్‌ కల్యాణ్‌ ఈ సినిమాలో వీరమల్లు అనే యోధుడిగా కనిపించనుండగా, బాబీ దియోల్‌ ఔరంగజేబ్‌ పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్‌, సత్యరాజ్‌, విక్రమ్ జీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందించారు.

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం హరి హర వీరమల్లు: స్వోర్డ్ అండ్ స్పిరిట్ జులై 24న థియేటర్లలో విడుదల కానుంది. రెండో భాగానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.



Show Full Article
Print Article
Next Story
More Stories