మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్న హరి హర వీర మల్లు

Hari Hara Veera Mallu To Go On Sets Again
x

మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్న హరి హర వీర మల్లు

Highlights

Pawan Kalyan: వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నారు.

Pawan Kalyan: "వకీల్ సాబ్" సినిమాతో మంచి హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వం లో "హరి హర వీర మల్లు" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలోని కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కానీ కరోనా కారణంగా, పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల కారణంగా ఈ సినిమా ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమాని మళ్లీ సెట్స్ పైకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు దర్శనిర్మాతలు.

మార్చ్ మొదటి వారం నుండి "హరి హర వీర మల్లు" షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. "భీమ్ లా నాయక్" షూటింగ్ పూర్తి చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో బిజీగా కానున్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం చిత్ర బృందం భారీ సెట్స్ వేస్తున్నట్టు సమాచారం. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories