Hari Hara Veera Mallu: పవన్ అభిమానులకు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు.. అధికారిక ప్రకటన

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ అండ్ స్పిరిట్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.

Ramya Vegirouthu
Published on: 19 Aug 2025 9:02 PM IST
Hari Hara Veera Mallu: పవన్ అభిమానులకు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు.. అధికారిక ప్రకటన
X

Hari Hara Veera Mallu: పవన్ అభిమానులకు బంపర్ బోనాంజా.. ఓటీటీలోకి వీరమల్లు.. అధికారిక ప్రకటన

పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ అండ్ స్పిరిట్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను క్రిష్–జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మించారు. జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ఆగస్టు 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హరి హర వీరమల్లు – పార్ట్ 1 స్ట్రీమింగ్ కానుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. దీంతో సౌత్ ఆడియన్స్‌కు డబుల్ ట్రీట్ అన్నమాట.

సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, పార్ట్ 1 ఇప్పటికే విడుదలై హిట్ అయింది. పార్ట్ 2 షూటింగ్ కూడా కొంతవరకు పూర్తయిందని సమాచారం. పవన్‌ కళ్యాణ్‌తో పాటు బాబీ డియోల్‌, నిధి అగర్వాల్‌, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్‌ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్‌లో మిస్ అయినవాళ్ల కోసం ఇప్పుడు ప్రైమ్‌లో చూడటానికి బంపర్‌ ఛాన్స్ అందుబాటులో ఉంది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story