Hari Hara Veera Mallu Movie Twitter Review: హరిహర వీరమల్లు మూవీ ట్విట్టర్ రివ్యూ

Hari Hara Veera Mallu Movie Twitter Review
x

Hari Hara Veera Mallu Movie Twitter Review: హరిహర వీరమల్లు మూవీ ట్విట్టర్ రివ్యూ

Highlights

Hari Hara Veera Mallu Movie Twitter Review: ఇటీవల ఓవర్సీస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రీమియర్‌ షోలకు మంచి స్పందన లభించిందని నెటిజన్లు తెలియజేశారు.

Hari Hara Veera Mallu Movie Twitter Review: మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పణలో రూపొందిన పాన్-ఇండియా చిత్రం "హరిహర వీరమల్లు" జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించగా, హీరోయిన్‌గా నిధి అగర్వాల్ కనిపించనుంది.

ఈ చిత్రంలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ ఖేడేకర్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, వీఎస్ జ్ఞాన శంకర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీని నిర్వహించారు.

ఇటీవల ఓవర్సీస్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రీమియర్‌ షోలకు మంచి స్పందన లభించిందని నెటిజన్లు తెలియజేశారు. సినిమా విజయం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. "ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టినప్పటికీ సమయాన్ని కేటాయించి నటించిన పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి" అంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
















Show Full Article
Print Article
Next Story
More Stories