Pawan cinema adavance booking: హైదరాబాద్‌లో హరి హర వీర మల్లు బుకింగ్స్ ఓపెన్.. కానీ బుక్ మై షోలో నో బుకింగ్

Pawan cinema adavance booking: హైదరాబాద్‌లో హరి హర వీర మల్లు బుకింగ్స్ ఓపెన్.. కానీ బుక్ మై షోలో నో బుకింగ్
x

Pawan cinema adavance booking: హైదరాబాద్‌లో హరి హర వీర మల్లు బుకింగ్స్ ఓపెన్.. కానీ బుక్ మై షోలో నో బుకింగ్

Highlights

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా హరి హర వీర మల్లు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుని ఎట్టకేలకు జులై 24 న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో రిలీజ్ కానుంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా హరి హర వీర మల్లు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అవన్నీ దాటుకుని ఎట్టకేలకు జులై 24 న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కోసం ఫ్యాన్స్ గత మూడు రోజులుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

జులై 22న ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. జూలై 24న ఉదయం 8 గంటలకు మొదటి షో పడనుంది. ఇప్పటికే ఈ టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయ్యాయి. అయితే ఈ సినిమా టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో లేవు. డిస్ట్రిక్ట్ యాప్‌లో మాత్రమే ఓపెన్ అయ్యాయి. అయితే బుక్ మై షోలో ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి రావొచ్చు. అయితే టికెట్ , సీట్ల వివరాల కోసం జొమాటో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో ప్రేక్షకులు ముందుగానే లొకేషన్‌లను ట్రాక్ చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చారిత్రక యాక్షన్-అడ్వెంచర్ సినిమాపై అందరూ ఆశలు పెట్టకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మరియు బాబీ డియోల్‌తో కలిసి ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్, సాహసం మరియు చారిత్రక నాటకం యొక్క అంశాలను మిళితం చేశారు. ఈ చిత్రం మొఘల్ శకం నేపథ్యంలోంది. భారతీయ జానపద కథల నుండి ప్రేరణ పొందిన కల్పిత కథనం. అలాగే ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో ఒకేసారి విడుదల అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories