Keeravani: గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది

Happy To Receive The Golden Globe Award
x

Keeravani: గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది

Highlights

Keeravani: నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చివారిని నమ్మకున్నా

RRR: టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డును ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకుంది. సినిమాలోని 'నాటు నాటు' పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్‌ అయింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. 'నాటు నాటు'కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌, రాజమౌళి, చరణ్‌ చప్పట్లు కొడుతూ సందడి చేశారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు కిరవాణి. ప్రతిష్ఠాత్మక అవార్డు ఇచ్చిన HFPAకు ధన్యవాదాలు తెలిపారు. సంతోష సమయాన్ని నా భార్యతో పంచుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పాటలో భాగస్వామ్యమైన రాహుల్ సిప్లిగంజ్‌కు కిరవాణి ధన్యవాదాలు తెలిపారు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చివారిని నమ్మకున్నానని చెప్పారు. అలాగే పాటకు కాళభైరవ అద్భుత సహకారం అందించారని కిరవాణి కొనియాడారు.

ఒక ఇండియన్ సినిమాకు తొలిసారిగా ఈ అవార్డు దక్కడం నిజంగా విశేషమనే చెప్పాలి. ట్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరిచారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు ప్రముఖ రచయిత చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.

ట్రిపుల్ ఆర్‌ సాధించిన అవార్డు భారతీయ చలనచిత్రం రంగం సెలబ్రేట్ చేసుకుంటుంది. చిత్ర యూనిట్‌కు మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెప్పారు. అపూర్వమైన విజయం సాధించిన ట్రిపుల్ ఆర్‌ టీంకు టేక్‌ ఏ బో అంటూ చిరు ట్వీట్ చేశారు.

దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. ఆయన సినిమాల్లో, మాటల్లో, చేతల్లో మన సంప్రదాయం కనబడుతుంది, వినబడుతుంది, స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా ఆయన మార్క్ చూపించారు. దీనిని రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీమ్ సాధించిన ఘనతగా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories