Guardian: ఓటీటీలో అదిరిపోయే థ్రిల్ల‌ర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచంటే..

Hansika Motwani Horror Thriller ‘Guardian’ Now Streaming on Aha OTT
x

Guardian: ఓటీటీలో అదిరిపోయే థ్రిల్ల‌ర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచంటే.. 

Highlights

Guardian: ఓటీటీలో హార్ర‌ర్ మూవీస్ చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థ‌లు సైతం స‌రికొత్త చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి.

Guardian: ఓటీటీలో హార్ర‌ర్ మూవీస్ చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే ఓటీటీ సంస్థ‌లు సైతం స‌రికొత్త చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మరో ఆస‌క్తిక‌ర‌మైన సినిమా ఓటీటీ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకునేందుకు వ‌చ్చేసింది. ఇంత‌కీ ఏంటా సినిమా.? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, భయాన్ని, ఉత్కంఠను అద్భుతంగా మిళితం చేస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయనుంది.

సబరి - గురు సరవణన్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, 2024 మార్చి 8న తమిళంలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. సస్పెన్స్‌కి గురి చేసే , ఆకర్షణీయమైన విజువల్స్, హన్సిక మోత్వానీ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సినిమాలో సామ్ C.ఎస్. అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ప్రతి సీన్‌ను మరింత హార్రిఫిక్‌గా మార్చగా, కె.ఏ. శక్తివేల్ సినిమాటోగ్రఫీ, ఎం. తియాగరాజన్ ఎడిటింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories