ఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా

Growing Akhil Agent Movie Budget | Telugu Movie News
x

ఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా

Highlights

*విపరీతంగా పెరుగుతూ వస్తున్న అఖిల్ ఏజెంట్ సినిమా బడ్జెట్

Agent Movie: ఇప్పటిదాకా యువ హీరో అక్కినేని అఖిల్ హీరోగా కేవలం 4 సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. అందులో మూడు సినిమాలు డిజాస్టర్లు కాగా, "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మాత్రమే కొంచెం పరవాలేదనిపించింది. మిగతా మూడు సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం అఖిల్ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "ఏజెంట్" పైనే పెట్టుకున్నాడు.

సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ రోజురోజుకీ భారీగా పెరుగుతూ వస్తోందట. మరోవైపు అఖిల్ ఈ సినిమాకి ఎటువంటి రేమ్యూనరేషన్ తీసుకోవటం లేదని తెలుస్తోంది. మరోవైపు సురేందర్ రెడ్డి కూడా ముందుగా రేమ్యోనరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేర్ లో కొంతభాగాన్ని తీసుకుందామని అనుకున్నారట.

కానీ తాజాగా సురేందర్ రెడ్డి తన రెమ్యునరేషన్ తనకు ముందే కావాలి అంటూ నిర్మాతలతో గొడవ పెట్టుకుంటున్నారట. దీంతో సినిమా షూటింగ్ మరింత వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున కలగజేసుకుని ఈ గొడవ ని సరిదిద్దితే బాగుంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు సినిమాకి మంచి హైప్ ఉండడంతో హిట్ టాక్ వచ్చినప్పటికీ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories