కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్న జాన్వి కపూర్..

కుర్రాళ్ల మ‌తి పోగొడుతున్న జాన్వి కపూర్..
x
జాన్వి కపూర్‌
Highlights

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి తెలుగు తమిళంతో పాటు పలు భాషల్లో నటించి ప్రేక్షకుల ఆదర అభిమానాలు పొందారు.

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి తెలుగు తమిళంతో పాటు పలు భాషల్లో నటించి ప్రేక్షకుల ఆదర అభిమానాలు పొందారు. ఆమె గత సంవత్సరం దుబాయ్‌లో తనువు చాలించిన సంగతి తెలిసిందే. కాగా..పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. జాన్వి సినిమాల్లోకి రాకముందే బ్యూటీతో కుర్రాళ్ల మనస్సు దోచుకుంది.

సినిమాల్లో నటించక ముందే జాన్వి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. ఇన్‌స్టాగ్రామ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జాన్వి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా జాన్వి దిగిన ఫొటో షూట్ కుర్రాళ్ల మతిపోట్టేలా ఉంది. ఆమె తన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. తెలుగు రంగు సూట్ వేసుకుని జైట్ ల్యాగ్ తో పోరాటం చేస్తున్నాను అని ఓ కామెంట్ పోస్టు చేసింది. దీంతో జాన్వీ కపూర్ పోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. అభిమానులైతే తెగ కామెంట్లు చేస్తున్నారు.

కొందరూ అభిమానులు , సినిప్రముఖులు అచ్చం శ్రీదేవిలానే ఉన్నావ్, నన్ను పెళ్లి చేసుకుంటావా అని సరదా కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఆమె నటించింన తొలి చిత్రం ధడక్ ఫస్ట్ లుక్ విడుదలైంది. జాన్వి నటించిన తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ధడక్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వి బ్లాక్ బస్టర్ హిట్ కొట్చింది. ఆ తర్వాత ఓ బయోపిక్ చిత్రంలో నటించనుంది. ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో జాన్వి నటిస్తుంది. తెలుగులోను విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఉందని జాన్వి చాల సార్లు తెలిపారు.

సోనమ్ కపూర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో గట్టపోటి ఇస్తుంది జాన్వి. సోనమ్ కపూర్ ఫొటోలు పోస్ట్ చేస్తే 3 లక్షల లైక్స్ వస్తాయి. కానీ, జాన్వి పెట్టే ఫొటోలకు 5లక్షలకు పైగా లైక్స్ వస్తున్నాయి. దీంతో జాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్ ఎంత ఉందో అర్థమవుతోంది. కానీ నెటిజన్స్ మాత్రం జాన్వి ఫొటోలకే ఎక్కువ ఫిదా అవుతున్నారు.ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉండే జాన్వి బోల్డ్ ఫొటోలతో అభిమానులను మంత్రముగ్ధలను చేస్తుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories