Seetimaarr Movie Review: "సీటీమార్" సినిమా రివ్యూ

Gopichand Seetimaarr Movie Review
x

 సీటీమార్ సినిమా రివ్యూ

Highlights

*వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న హీరో గోపీచంద్ తాజాగా ఇప్పుడు "సీటీ మార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

చిత్రం: సీటీమార్

నటీనటులు: గోపీచంద్, తమన్నా, దిగంగనా, రావు రమేష్ తదితరులు

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సౌందరాజన్

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

దర్శకత్వం: సంపత్ నంది

బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

విడుదల తేదీ: 09/09/2021

వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న హీరో గోపీచంద్ తాజాగా ఇప్పుడు "సీటీ మార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్పోర్ట్స్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ ఒక కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారు. "గౌతమ్ నంద" సినిమా తో తనకు మంచి హిట్ అందించిన సంపత్ నంది ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా ఇవాళ అనగా సెప్టెంబర్ 10, 2021 న వినాయకచవితి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా.

కథ:

కార్తీక్ సుబ్రహ్మణ్యం (గోపీచంద్) ఆంధ్ర మహిళల కబడ్డీ జట్టు కోచ్. కొందరు బాగే ఆడే అమ్మాయిల కుటుంబాలు కబడ్డీ ఆడటానికి అంగీకరించకపోవడంతో వారిని ఒప్పించేందుకు కష్టపడతాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మహిళలు కబడ్డీ జట్టు కోచ్ అయిన జ్వాలా రెడ్డి తమన్నా తో ప్రేమలో పడతాడు. నేషనల్ కబడ్డీ పోటీలలో వీరి జట్టులు రెండూ పోటీ పడడానికి సిద్ధమవుతాయి. కానీ కార్తీక్ మరియు జ్వాల ని ఒక గ్యాంగ్ బెదిరిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పోలీస్ వాళ్లకి ఎందుకు ఇబ్బందులను కలిగేలా చేశాడు? చివరికి కార్తిక్ లేదా జ్వాల టీమ్ గెలిచిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

చాలా రోజుల తర్వాత గోపీచంద్ ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపించడం ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. కబడ్డీ కోచ్ గా గోపీచంద్ ఆ పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. తమన్నా నటన కూడా ఈ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. కేవలం గ్లామర్ తో మాత్రమే కాక నటనతో కూడా ఈ సినిమాతో మంచి మార్కులు వేయించుకుంది. జ్వాల రెడ్డి పాత్రలో ఆమె నటన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ యాసలో తమన్నా డైలాగులు చాలా బాగున్నాయి. దిగంగనా కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది. రావు రమేష్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ నటనతో అందరి దృష్టి ఆకర్షించారు.

సాంకేతికవర్గం

సంపత్ నంది ఈ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించారు. ఆయన కష్టం ఫలించింది అని చెప్పుకోవాలి. ఆయన టేకింగ్, నెరెట్ చేసిన విధానం చాలా బాగుంది. కథ కొత్తగా లేకపోయినప్పటికీ ఆ కథను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా చేయడంలో సంపత్ నంది సఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి మణిశర్మ చాలా చక్కని సంగీతాన్ని అందించారు. పాటలు మాత్రమే కాకుండా మ్యూజిక్ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా జ్వాల రెడ్డి పాట సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఛాయా, ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపించాయి.

బలాలు:

గోపీచంద్ నటన

సందీప్ నంది దర్శకత్వం

ఫస్ట్ హాఫ్

క్లైమాక్స్ మెసేజ్

బలహీనతలు:

సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్

ఎంటర్టైన్మెంట్ లేకపోవడం

చివరి మాట:

ఒక కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా చిత్రం నుంచి ప్రేక్షకులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఈ సినిమాలో ఉండేలా చూసుకున్నారు సంపత్ నంది. ఈ సినిమాని ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. అంతేకాకుండా మహిళా సాధికారత గురించి ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ మరియు వచ్చిన డైలాగులు చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో హీరో విలన్ ల మధ్య సన్నివేశాలు ఇంకొంచెం బాగా ఉండొచ్చు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్ట్ లు చాలా ఔట్ డేటెడ్ గా ఉంటాయి. అయినప్పటికీ సినిమాని ఒకసారి ఖచ్చితంగా చూసేయొచ్చు.

బాటమ్ లైన్:

సీటీమార్ తో గట్టిగానే సిటీలు వేయించిన గోపీచంద్.

Show Full Article
Print Article
Next Story
More Stories