పక్కా కమర్షియల్‌ అంటున్న గోపీచంద్‌

Gopichand says he will not shoot till then
x

 అప్పటిదాకా షూటింగ్ చేయను అంటున్న గోపీచంద్

Highlights

Gopichand: *రెమ్యూనరేషన్ బాకీ ఉండడంతో షూటింగ్ పూర్తి చేయను అంటున్న గోపీచంద్.

Gopichand: ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ కమర్షియల్ హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. ఒకప్పుడు విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన గోపీచంద్ ఇప్పుడు హీరోగా బాగానే సినిమాలు చేస్తున్నారు. తాజాగా గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా పక్కా కమర్షియల్. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ సినిమా మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇక త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్న దర్శకనిర్మాతలు ప్రస్తుతం సినిమా నుంచి పాట టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అయితే ఇంకా ఈ పాట షూటింగ్ పూర్తి కాలేదు. నిజానికి ఈ పాట షూటింగ్ కోసం రాశి ఖన్నా ఇప్పటికే చాలాసార్లు తన డేట్ లో వచ్చింది కానీ గోపిచంద్ మాత్రం పాట షూటింగ్ పూర్తి చేయలేదట. సినిమా కోసం నిర్మాతలు ఇస్తామన్నా నా రెమ్యూనరేషన్ లు ఇంకా రెండు కోట్లు బాకీ ఉందట. తన రెమ్యునరేషన్ తనకి పూర్తిగా రాకపోవడంతో పాటలు షూటింగ్ చేయడానికి కూడా గోపీచంద్ ఆసక్తి చూపించడం లేదట. మరి నిర్మాతలు లేదా గోపీచంద్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి సినిమా షూటింగ్ పూర్తి చేస్తారో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories