బాలయ్య కోసం బోయపాటి మార్క్ లో సినిమా చేయనున్న గోపీచంద్

Gopichand Malineni will Narrate Powerful Dialogues with Balakrishna
x

బాలయ్య తో పవర్ ఫుల్ బూతు డైలాగులు చెప్పించనున్న గోపీచంద్

Highlights

*బాలయ్య తో పవర్ ఫుల్ బూతు డైలాగులు చెప్పించనున్న గోపీచంద్

Gopichand Malineni: బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబనేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పచ్చు. ఇంకే దర్శకుడు చుపించనటి విధంగా బాలయ్య ను బోయపాటి చూపిస్తారు. అందుకే వారిద్దరి కాంబో లో విడుదల అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా మారాయి. "సింహ", "లెజెండ్" తర్వాత మొన్న విడుదలైన "అఖండ" కూడా వీరికి మర్చిపోలేని హిట్స్ గా నిలిచాయి. బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య అంటేనే అభిమానులకు మాస్ విందు ఉంటుంది.

అయితే తాజా సమచారం ప్రకారం బాలయ్య ఇప్పుడు "క్రాక్" ఫేమ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే బాలకృష్ణ కోసం గోపీచంద్ బోయపాటి మార్క్ సన్నివేశాలు రాసుకున్నట్టు తెలుస్తోంది. బోయపాటి బాలయ్య తో పవర్ఫుల్ డైలాగులు చెప్పించినట్టు గోపీచంద్ కూడా తన సినిమాలో మంచి డైలాగులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి లాగే గోపీచంద్ మలినేని కూడా కొన్ని బూతులు కూడా వడనున్నారట. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య సన్నివేశాలలో డైలాగులు మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా కొన్ని బీప్ వాడాల్సిన పదాలను కూడా పెట్టి ప్రిపేర్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమాలో గోపీచంద్ బోయపాటి మార్క్ ఎలివేషన్లు, స్ట్రాంగ్ విలన్ పాత్ర, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండేలాగా చూసుకుంటున్నాట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories