Top
logo

అటు ఇటు తిప్పి అదే టైటిల్ ఫిక్స్ చేశారు

అటు ఇటు తిప్పి అదే టైటిల్ ఫిక్స్ చేశారు
X
Highlights

సరైనా హిట్ లేకా గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు హీరో గోపీచంద్.. ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.

సరైనా హిట్ లేకా గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు హీరో గోపీచంద్.. ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేశారు.

ముందునుంచి అనుకున్తునట్టుగానే 'సీటీమార్‌'అనే టైటిల్‌నే ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. కబడ్డీ ఆట నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సినిమా పోస్టర్ ని చూస్తేనే అర్ధం అవుతుంది. నెత్తిన టోపీ ధరించి, విజిల్‌ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా గోపీచంద్ లుక్ ని సిద్దం చేశారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుటున్న ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తరుణ్ అరోర విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు

గతంలో గోపీచంద్, సంపత్‌ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే . ఈ సినిమా బాగా ఆడకపోయినా గోపీచంద్ ని బాగా చూపించారన్న పేరు మాత్రం బాగానే వచ్చింది. దీనితో ఈ సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.Web TitleGopichand latest movie title has fixed
Next Story