Gopichand 30th Movie : "లక్ష్యం" కోసం "లౌక్యం"గా మూడోసారి

గోపీచంద్ ౩౦ సినిమా పోస్టర్(ట్విట్టర్ ఫోటో)
Gopichand 30th Movie: తెలుగు సినిమా నటుడు గోపీచంద్ త్వరలో తన కెరీర్లో 30వ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ...
Gopichand 30th Movie: తెలుగు సినిమా నటుడు గోపీచంద్ త్వరలో తన కెరీర్లో 30వ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. జయం, వర్షం, నిజం వంటి చిత్రాల్లో విలన్ గా యజ్ఞం, లక్ష్యం వంటి చిత్రాలతో హీరోగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన గోపి చంద్ త్వరలో తనకి ఇప్పటివరకు రెండు సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తన 30వ చిత్రంలో నటించబోతున్నాడు. లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీవాస్ బాలకృష్ణ తో చేసిన డిక్టేటర్, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన సాక్ష్యం చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం గోపి చంద్ కూడా సరైన హిట్లు లేక సతమతమవుతుండంతో గతం సూపర్ హిట్ చిత్రాలు చేసిన ఈ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా నటించిన "సీటీమార్" చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉన్న గోపిచంద్ అతి త్వరలో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకేక్కబోతున్న చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో అలాగే ఈ ఇద్దరు తమ కాంబినేషన్ లో రెండు సూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ 30 హ్యాట్రిక్ సాధిస్తారో చూడాలి.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Pakistani Drone: సరిహద్దులో అనుమానాస్పద డ్రోన్.. కూల్చేసిన భద్రతా...
29 May 2022 9:06 AM GMTNepal: నేపాల్లో కూలిన విమానం
29 May 2022 8:50 AM GMTAudimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు
29 May 2022 8:34 AM GMTబీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMT