RRR అప్డేట్ : చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

RRR అప్డేట్ : చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
x
RRR, NTR, Ram charan (File Photo)
Highlights

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ముందుగా సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వాలంటూ నెటిజన్లు చిత్రయూనిట్ కి అభిమానులు ట్వీట్లు పెట్టారు. దీనితో చిత్రబృందం స్పందిస్తూ.. విడుదలయ్యే వరకు మధ్య మధ్యలో సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తామని ప్రకరించింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని కోపంగా ఉన్న ఎమోజీలతో.. 'అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావ్‌' అని ట్వీట్‌ చేశాడు. దానిపైన చిత్రబృందం స్పందిస్తూ.. మార్చిలో సర్‌ప్రైజ్‌ ఇస్తామని వెల్లడించింది. ప్రస్తుతం #RRRUpdatesFromMarch అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ముందుగా ప్రకటించినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి టైం సరిపోకపోవడంతో 2021 జనవరి 8న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories