Ghati: పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..

Ghati: పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..
x
Highlights

స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గినప్పటికీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అభిమానులను అలరించాలని ప్రయత్నిస్తున్న స్వీటీ అనుష్క పరిస్థితి ఈ మధ్య అంతగా బాగోలేదు.

స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గినప్పటికీ, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అభిమానులను అలరించాలని ప్రయత్నిస్తున్న స్వీటీ అనుష్క పరిస్థితి ఈ మధ్య అంతగా బాగోలేదు. భాగమతి తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఘాటీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వరుస అడ్డంకులు ఎదురయ్యాయి.

మొదట ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని అనుకున్నా, షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడింది. తర్వాత జూలై 11న రిలీజ్ చేస్తామని ప్రకటించగా, సీజీ వర్క్ పూర్తి కాక మరోసారి వాయిదా పడింది. తాజాగా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుందని ఫిక్స్ చేస్తూ, ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.

కానీ అదే రోజున నాలుగు పెద్ద సినిమాలు పోటీగా వస్తున్నాయి — తేజ సజ్జా మిరాయ్, రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్, శివకార్తికేయన్–మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ మూవీ, అలాగే విజయ్ ఆంటోనీ సినిమా. ఈ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం వల్ల ఘాటీకి థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది.

సోలో రిలీజ్ కోసం చేసిన ప్లాన్ విఫలమవడంతో, బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని సాధించాలంటే బ్లాక్‌బస్టర్ టాక్ రావడం తప్పనిసరి. ప్రస్తుతం ఈ సినిమాపై అనుష్క క్రేజ్, క్రిష్ మీద నమ్మకం, అలాగే ట్రైలర్ బజ్ మాత్రమే ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5న ఘాటీ ఏ రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories