Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి రోల్ దొరికిందిగా!

Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి రోల్ దొరికిందిగా!
x

Ghaati Trailer: సీతమ్మోరు లంకా దహనం చేస్తే? అనుష్కకి మరో అరుంధతి రోల్ దొరికిందిగా!

Highlights

చాలా గ్యాప్ తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించబోతున్న అనుష్క శెట్టి, ‘ఘాటి’ అనే యాక్షన్‌ క్రైమ్‌ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది.

చాలా గ్యాప్ తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌ మీద కనిపించబోతున్న అనుష్క శెట్టి, ‘ఘాటి’ అనే యాక్షన్‌ క్రైమ్‌ డ్రామాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది. హరిహరవీరమల్లు నుంచి బయటపడ్డ తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది.

ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఓ సాధారణ బాధితురాలు… పరిస్థితుల మధ్య క్రిమినల్‌గా మారి, తర్వాత సామాజిక మార్పు కోసం నిలబడే లెజెండరీ క్యారెక్టర్‌గా అనుష్క శెట్టి పర్ఫార్మ్‌ చేస్తోంది.

ట్రైలర్‌లో ఏముంది?

ట్రైలర్ చూస్తే… బ్రిటిష్ కాలంలో పర్వత ప్రాంతాల్లో రోడ్లు నిర్మించిన ఘాటీలను ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్‌కి ఎలా వాడుతున్నారన్న థీమ్‌ను చూపించారు. ఆ నేపథ్యంలో అనుష్క, విక్రమ్ ప్రభు లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. అనుష్క పాత్రను టార్గెట్ చేయడం, బాధితురాలిగా మారిన ఆమె అవినీతిపై యుద్ధం చేస్తూ, తన ఘాటీలను రక్షించేందుకు సాగిన పోరాటం థ్రిల్లింగ్‌గా కనిపిస్తోంది.

జగపతిబాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ పాత్రలు కూడా ట్రైలర్‌లో ఇంప్రెస్ చేశాయి. "సీతమ్మోరు లంకా దహనం చేస్తే?" అంటూ అనుష్క పవర్‌ఫుల్ డైలాగ్‌ను డెలివర్ చేస్తుండగా… ఆమెకి ‘అరుంధతి’ తరహా మళ్లీ ఓ స్ట్రాంగ్ రోల్ దక్కినట్టు ఫీలింగ్‌ కలుగుతుంది.

విడుదల వాయిదా – చివరకు రిలీజ్ డేట్ ఫిక్స్

గతేడాది మార్చిలో అనౌన్స్ అయిన ఈ సినిమా, జూలై 11న విడుదల కావాల్సి ఉండగా, గ్రాఫిక్స్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 5న సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

అయితే అదే రోజున తేజ సజ్జ 'మిరాయి', శివకార్తికేయన్ 'మద్రాసి' సినిమాలు కూడా విడుదల కానున్న నేపథ్యంలో, ఘాటి పెద్ద పోటీకి దిగబోతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories