చరిత్ర మరిచిపోయిన ఓ లీడర్ కథ జార్జిరెడ్డి... నెటిజన్లను ఆకట్టుకున్న ట్రైలర్

చరిత్ర మరిచిపోయిన ఓ లీడర్ కథ జార్జిరెడ్డి... నెటిజన్లను ఆకట్టుకున్న ట్రైలర్
x
Highlights

విద్యార్థి నేతగా ఎదిగిన జార్జిరెడి బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది.

జార్జిరెడి ఉస్మానియా యూనివర్శిటీలో చదుకుని విద్యార్థిగా ఉద్యమాల్లో నాయకుడిగా ఎదిగాడు‎. ధైర్యానికి మారు పేరు జార్జి రెడ్డి. ఆయన ప్రస్థానం ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థి నేతగా ఎదిగిన జార్జిరెడి బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసింది. కమర్షియల్ హీరో చేసే సాహసాలన్నీ జార్జి రెడ్డి జీవితంలో చేసినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. చరిత్ర మరిచిపోయిన విద్యార్థి నాయకుడిని అనే అంశం ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

1965 నుంచి 1975 కాలంలో ఉస్మానియాలో చదివిన ప్రతీ విద్యార్థికి జార్జిరెడ్డి గురించి తెలుసు. ఈ చిత్రాన్ని మైక్ మూవీస్ బ్యానర్ ''సిల్లీ మాంక్స్ స్టూడియో'' త్రీ లైన్స్, కలిసి నిర్మించారు. సందీప్ మాధవ్ ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు.‎ శత్రు, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, తిరువీర్, ముస్కాన్, అభయ్, మహాతి ఇతర నటీనటులు. ప్రముఖ హీరో సత్య దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories