జార్జిరెడ్డి సినిమా రివ్యూ : కన్నీరు తెప్పించిన జార్జ్

జార్జిరెడ్డి సినిమా రివ్యూ : కన్నీరు తెప్పించిన జార్జ్
x
George Reddy
Highlights

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రిలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, వంగవీటి రంగ, సావిత్రి నిజజీవిత కథల ఆధారంగా సినిమాలనుతెరకెక్కిన విషయం...

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రిలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎన్టీఆర్, వైఎస్ఆర్, వంగవీటి రంగ, సావిత్రి నిజజీవిత కథల ఆధారంగా సినిమాలనుతెరకెక్కిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధి దశలోనే విప్లవ ఉద్యమాన్ని నడిపిన జార్జి రెడ్డి జీవితాన్ని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చారు. ఈ చిత్రం నేడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆరంభం నుంచి జార్జిరెడ్డి సినిమాకోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సందీప్‌ మాధవ్ జార్జిరెడ్డిగా నటించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సురేష్ బొబ్బిలి అందించారు. సత్య దేవ్, చైతన్య కృష్ణ, మనోజ్‌ నందన్, వినయ్‌ వర్మ, అభయ్‌,మహాతి, ముస్కాన్, ముఖ్య తారాగణం ఈ చిత్రంలో ఉన్నారు. అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జార్జిరెడ్డి అందరి అంచనాలను అందుకున్నాడా? లేదా?.

‌కథ

జార్జిరెడ్డి (సందీప్‌ మాధవ్‌) చిన్ననాటి నుంచి చదువులో చూరుకుగా ఉండేవాడు. తల్లి (దేవిక) తోడ్పాటుతో చిన్నతనంలో వామపక్ష భావాలను అలవర్చుకుంటాడు. జార్జిరెడ్డి కళ్ళ ముందు ఎదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేడు. భగత్‌ సింగ్‌, చెగువేరా స్పూర్తితో తిరగబడతాడు. జార్జిరెడ్డికి చదువుతో పాటు బాక్సింగ్ కత్తిసాము, ఇలా అన్ని విద్యలు తల్లి నేర్పిస్తుంది. పెద్దవాడైన తర్వాత జార్జిరెడ్డి ఉన్నత చదువుల కోసం కేరళ నుంచి హైదరాబాద్ వస్తాడు. డిగ్రీ విద్యకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరతాడు.

ఓయూలో అతనికి దస్తగిరి(పవన్), రాజన్న ( అభయ్)లు స్నేహితులు అవుతారు. ఓయూలోని పేద,ఉన్నత వర్గాల మధ్య వివక్ష అతన్ని ఆలోచింప చేస్తాయి. అనతికాలంలో విద్యార్ధి నాయకుడిగా ఎదుగుతాడు. స్టూడెంట్ యూనియన్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఏబీసీడీ ఉద్యమ నేత సత్య (సత్యదేవ్)3సార్లు ప్రెసిడెంట్‌గా ఎన్నికై ఈ విద్యార్థి నాయకుల ఎన్నికల్లో తన శిష్యుడు అర్జున్‌ (మనోజ్‌ నందం) బరిలో నిలుపుతాడు. అయితే మరో విద్యార్థి యూనియన్‌ను జార్జిరెడ్డి స్థాపిస్తాడు. ఆ ఎన్నికల్లో జార్జిరెడ్డి తిరుగులేని నాయకుడిగా ఎదుగుతాడు. ఇంతలోనే జార్జీరెడ్డి ప్రేమలో పడుతుంది మాయ (ముస్కాన్‌).

కొందరి నేతల అండతో లక్ష్మణ్ (శతృ) ఓయూలో గూండాగిరి చేస్తాడు. లక్ష్మణ్ తమ్ముడు (లలన్) విద్దార్థినులను ఏడిపిస్తాడు. దీంతో జార్జిరెడ్డి అతనికి బుద్ది చేబుతాడు. క్యాంపస్ లో ర్యాగింగ్ లేకుండా చూస్తాడు జార్జిరెడ్డి. ర్యాగింగ్ ఎవరు చేసిన వారిని గుణపాఠం చెబుతుంటాడు.

చిన్నతనం నుంచి వామపక్ష భావాలు కలిగిన జార్జిరెడ్డి. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాడు. జార్జిరెడ్డి పోరాటానికి పలువురి మద్దతు ఉంటుంది. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న జార్జిరెడ్డిని ఓయూ క్యాంపస్‌లోనే హత్య చేస్తారు. జార్జిరెడ్డిని ఎవరు చంపారు? దానికి కారణం ఏంటి ? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సాకేతికంగా..

ఈ చిత్రం కోసం దర్శకుడు జీవన్ రెడ్డి హోం వర్క్ ప్రతి సీన్ లోను కనిపిస్తోంది. జార్జిరెడ్డి సినిమాను తెరపై ఆవిష్కరించడంలో డైరక్టర్ సక్సెస్ అయ్యాడు. చిత్రంలో ఎక్కడా కుల, మతల జోలికి పోకుండా వివాదాలు రాకుండా జాగ్రత్తా పడ్డారు. ప్రతి ఒక్కరి పాత్రను నిజ జీవిత వ్యక్తులకు తగ్గట్టుగా తీయగలిగారు.వాస్తవ కథకు కమర్షియల్ హంగులు జోడించి అసలు కథను పక్కదారి పట్టించకుండా దర్శకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. మొదటి భాగంలో స్క్రీన్ ప్లే చాలా బాగున్నా..ఇంటర్వేల్ తర్వాత కాస్త నెమ్మదించింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సీన్స్ సినిమాకు జోడించినట్లు కలిపిస్తుంది.

జార్జిరెడ్డి పాత్ర చేయాలంటే అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్ పర్శనాలిటీ ఉన్న వ్యక్తి కావాల్సిందే. అందుకు తగ్గట్టుగానే ఆ పాత్రకు సందీప్ మాధవ్ ను ఎంచుకున్నాడు. దర్శకుడి నమ్మకాన్ని నిలబెడుతూ..సందీప్ జార్జిరెడ్డిగా పరకాయ ప్రవేశం చేశాడు. వంగవీటి చిత్రం తర్వాత సందీప్ జార్జిరెడ్డిగా మరో బయోపిక్ తీశాడు. సందీప్ తన నటనతో జార్జిరెడ్డి చూడని వారికి జార్జిరెడ్డి ఇలానే ఉంటాడా అనే విధంగా మళ్లీ ఆయన్ని గుర్తుతెచ్చారు. చనిపోయే సీన్‌లో సందీప్ మాధవ్ కంటతడి పెట్టించాడు .చాలా సన్నివేశాల్లో సంభాషణలు హిందీ, ఇంగ్లీష్‌లలోనే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఈ సినిమా మొత్తం ఓయూలోనే ఉండటంతో ప్రత్యేకించి ఓ సెట్ వేశారు.ఇక హీరోయిన్‌ పాత్రలో ముస్కన్ ఆకట్టుకుంది. ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. జార్జిరెడ్డి తల్లి దేవిక ఎమోషన్స్ సీన్స్ బాగా పండించింది. పటాస్ యాదమరాజు తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ కేకపెట్టించాయి.

ఈ సినిమాకు సురేష్‌ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత బలాన్ని ఇచ్చింది. మంగ్లీ పాడిన ఓ చాలా పాట బాగుంది. చిన్న సినిమానే అయినప్పటికీ నిర్మాత అప్పిరెడ్డి రాజీలేకుండా నిర్మించారు.

మొత్తం మీద జార్జిరెడ్డి ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాడనే చెప్పించాలి.

గమనిక సమీక్షకుడి అభిప్రాయం మేరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది.పూర్తి సినిమాను థియేటర్లో చూడాల్సిందిగా మనవి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories