రాజకీయ నాయకుడి కోసం రంగంలోకి దిగిన జెనీలియా

Genelia Will Start the Second Inning | Tollywood News
x

రాజకీయ నాయకుడి కోసం రంగంలోకి దిగిన జెనీలియా

Highlights

రాజకీయ నాయకుడి కోసం రంగంలోకి దిగిన జెనీలియా

Genelia: ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లో ఒకరిగా ఉన్న జెనీలియా దాదాపు స్టార్ హీరోలతో నటించి మంచి హిట్ సినిమాలను అందించింది. అయితే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జెనీలియా చాలా కాలం పాటు టాలీవుడ్ కి దూరంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం జెనీలియా మళ్లీ 10 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు హీరోయిన్గా చేసినప్పుడు జెనీలియా 70 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకునేది. అయితే తాజాగా ఒక సినిమాలో హీరో కి అక్క పాత్రలో నటించేందుకు జెనీలియా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని కోసం ఆమె కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

హీరో అక్క పాత్ర చేసినందుకు ఆమె ఏకంగా మూడు కోట్లు రెమ్యునరేషన్ అడిగిందట. ఆసక్తికరంగా నిర్మాతలు కూడా వెంటనే ఓకే చెప్పేశారు. ప్రముఖ వ్యాపారవేత్త మరియు వివాదాస్పద రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు పెళ్లి కోసం 500 కోట్లు ఖర్చు పెట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు తన కుమారుడు కిరీటి గాలి సినిమా కోసం స్టార్ నటీనటులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జెనీలియా ని కూడా సినిమాలో ముఖ్య పాత్ర కోసం సంప్రదించారు. ఇక ఈ సినిమాతో జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories