బాలీవుడ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న చందు మొండేటి

Geetha Arts planning a massive project with Chandoo Mondeti
x

బాలీవుడ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న చందు మొండేటి

Highlights

బాలీవుడ్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్న చందు మొండేటి

Chandoo Mondeti: నిఖిల్ హీరోగా నటించిన "కార్తికేయ 2" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా 2014లో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన "కార్తికేయ 2" కూడా మొదటి భాగం కంటే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒకవైపు తెలుగులో మాత్రమే కాక నార్త్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలయ్యాయి.

ఈ సినిమా మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో ముందుకు దూసుకు వెళ్ళింది. ఇక ఈ సినిమా సక్సెస్ చూసిన నిర్మాతలు చందు మొండేటి ముందు క్యూ కడుతున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కూడా చందు మొండేటి తో ఒక సినిమా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ వంటి వారిని అనుకుంటున్నారట.

ఇప్పటికే గీత ఆర్ట్స్ కు చందు మొండేటి కథను వినిపించేసారు. అది స్క్రిప్ట్ గా మారే లోపు సినిమాలో హీరోగా ఎవరు ఉంటే బాగుంటుందని చిత్ర బృందం దర్శకనిర్మాతలు ఒక నిర్ణయానికి రాబోతున్నారు. గీత ఆర్ట్స్ ప్రయత్నిస్తే బాలీవుడ్ లో పెద్ద హీరోలు సైతం సినిమా చేయడానికి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మరి చందు మొండేటి డైరెక్షన్ లో నటించబోయే స్టార్ హీరో ఎవరు అని ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories