అల్లు శిరీష్ తో రిస్క్ తీసుకోబోతున్న గీత ఆర్ట్స్

అల్లు శిరీష్ తో రిస్క్ తీసుకోబోతున్న గీత ఆర్ట్స్

Rama Rao
Updated on: 1 Oct 2022 9:31 PM IST
Geetha Arts is Going to Take a Risk with Allu Sirish
X

అల్లు శిరీష్ తో రిస్క్ తీసుకోబోతున్న గీత ఆర్ట్స్

Geetha Arts: టాలీవుడ్ లో చాలానే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ ఉండే సినిమాలు తీస్తుంటారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ సినిమాలు తీస్తూ ఉంటారు. గీత ఆర్ట్స్ వారు గ్లామరస్ సినిమాలు తీస్తుంటారు. తాజాగా ఇప్పుడు గీత ఆర్ట్స్ ఒక స్పైసి హాట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అదే "ఊర్వశివో రాక్షసివో".

గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్న అల్లు శిరీష్ తాజాగా ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షక ముందుకి రాబోతున్నారు. అను ఎమ్మాన్యూల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. శారీరకంగా ఒక అబ్బాయికి దగ్గర అవుతుంది, కానీ తనని ప్రేమించడం లేదని పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని చెప్పే క్యారెక్టర్ హీరోయిన్ ది.

ఇలాంటి ఒక కాన్సెట్లో అల్లు అరవింద్ సినిమా తీయటం అభిమానులకి మరింత షాక్ ఇస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడితూ వచ్చింది. మరోవైపు కేవలం అడల్ట్ కంటెంట్ మీద సినిమాని నడపటం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందని అల్లు అరవింద్ సైతం ఆలోచించటం జరిగింది. గతంలో ఈ సినిమాకి "ప్రేమంటే.. కాదంట" అని టైటిల్ ని అనుకున్నారు. ఇక ట్రైలర్ చూశాక ఆ టైటిల్ అయితే సినిమాకి ఇంకా బాగా సెట్ అవుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story