వరుసగా యువ హీరోలతో సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్

Geeta Arts is Blocking Dates with Young Heroes
x

వరుసగా యువ హీరోలతో సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్

Highlights

వరుసగా యువ హీరోలతో సినిమాలు చేస్తున్న గీతా ఆర్ట్స్

Geetha Arts: ప్రస్తుతం అల్లు బాబి మరియు బన్నీ వాసు గీతా ఆర్ట్స్ తరఫునుండి యువ హీరోల డేట్లు బ్లాక్ చేస్తున్నారు. పెళ్లి చూపులు సినిమా హిట్ అయిన వెంటనే విజయ్ దేవరకొండ ని లైన్ లో పెట్టి గీత గోవిందం సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల రెవెన్యూ ని సంపాదించింది. ఆతర్వాత యువ హీరో కార్తికేయ డేట్ లో కూడా ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే బుక్ చేసుకున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన చావుకబురు చల్లగా సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు గీతాఆర్ట్స్ మరొక యువ హీరో డేట్లు బ్లాక్ చేస్తోంది. ఆ హీరో మరెవరో కాదు కిరణ్ అబ్బవరం. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆ కిరణ్ అబ్బవరం హీరోగా గీత నిర్మించనుంది. మరోవైపు అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా హిట్టవడంతో అల్లు అరవింద్ విశ్వక్ సేన్ కోసం ఒక పార్టీ కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే విశ్వక్ సేన్ తో గీతా ఆర్ట్స్ వారు ఒక సినిమా సైన్ చేయించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories