Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రకటన..విజేతలు వీళ్లే..ఉత్తమ చిత్రంగా కల్కి

Gaddar Awards winners announced telugu news
x

Gaddar Film Awards: గద్దర్ అవార్డుల ప్రకటన..విజేతలు వీళ్లే..ఉత్తమ చిత్రంగా కల్కి

Highlights

Gaddar Film Awards: ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా...

Gaddar Film Awards: ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నటి జయసుధ నేత్రుత్తంలోని సినీ అవార్డుల జూరి ఏర్పాటయ్యింది. ఈ క్రమంలో గురువారం ఉదయం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు.

దాదాపు 14సంవత్సరాల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇవ్వబోతుందని ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేసినట్లుచెప్పారు. అవార్డులు తమకు బూస్ట్ఇస్తాయని ప్రభుత్వం తమకు ఫ్రీడమ్ ఇచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్ రాజుకు ధన్యవాదాలు తెలిపారు. 14సంవత్సరాల తర్వాత అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డులు వస్తున్నాయని తెలిపారు. జూన్ 14న హైటెక్స్ లో అవార్డుల ప్రదానం జరుగుతుందన్నారు. అలాగే 2014-23సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలోనే ప్రకటిస్తామన జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ తెలిపారు.

గద్దర్ అవార్డులు వీరికే

ఉత్తమ చిత్రం - కల్కి

ఉత్తమ రెండో చిత్రం - పొట్టేల్

ఉత్తమ మూడో చిత్రం - లక్కీభాస్కర్

ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2)

ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథకాదు)

ఉత్తమ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి)

ఉత్తమ సహాయ నటుడు - ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్)

ఉత్తమ హాస్యనటుడు - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)

ఉత్తమ సంగీత దర్శకుడు - బీమ్స్ (రజాకార్)

ఉత్తమ స్టోరీ రైటర్ - శివ పాలడుగు

ఉత్తమ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ గాయకుడు - సిద్ద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన)

ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2)

ఉత్తమ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (దేవర)

స్పెషల్ జ్యూరీ అవార్డు - దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)

స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్)

బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ - యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)

2024 ఉత్తమ బాలల చిత్రం - 35 చిన్న కథకాదు

బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ - హెరిటేజ్-హిస్టరీ విభాగం - రజాకార్

నేషనల్ ఇంటెగ్రిటీ - సోషల్‌ అప్‌లిఫ్ట్ విభాగం - కమిటీ కుర్రాళ్లు

Show Full Article
Print Article
Next Story
More Stories