యూరోపియన్ డ్రామా ఆధారంగా విడుదల కాబోతున్న "గాలివాన"

Gaali Vaana Web Series Going to Release in OTT Platform
x

యూరోపియన్ డ్రామా ఆధారంగా విడుదల కాబోతున్న "గాలివాన"

Highlights

* గాలివాన అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బి.బి.సి

Gaali Vaana: త్వరలో తెలుగులో "గాలివాన" అనే ఒక వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. బిబిసి స్టూడియోస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ లు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ త్వరలో జి5 లో విడుదల కాబోతుంది. ఇంతకుముందు బి.బి.సి స్టూడియోస్ వారు నిర్మించిన ఒక యూరోపియన్ డ్రామా కథను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్చి విడుదల చేస్తున్న వెబ్ సిరీస్ ఇది. సాయికుమార్, రాధిక శరత్ కుమార్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే షూటింగ్ మొదలైంది అని చెప్పుకొచ్చింది నిర్మాణ బృందం.

ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ నాటకాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి ఒక వెబ్ సిరీస్ నిర్మించడం ఇదే మొట్టమొదటిసారి. ఈ వెబ్ సిరీస్ తో బి బి సి వారు రీజనల్ ఎంటర్టైన్మెంట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. చాందిని చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి, తదితరులు ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈమధ్యనే సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శరణ్ కొప్పిశెట్టి ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. సుజాత సిద్ధార్థ్ ఈ వెబ్ సిరీస్ కు ఛాయాగ్రహకుడు గా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories