ఎన్టీఆర్ సినిమాకి ఫన్నీ టైటిల్ పెడుతున్న అభిమానులు

Fans gave a funny title to NTR30 Film
x

ఎన్టీఆర్ సినిమాకి ఫన్నీ టైటిల్ పెడుతున్న అభిమానులు

Highlights

NTR 30: తాజాగా ఈ సినిమాకి అభిమానులు ఒక ఫన్నీ టైటిల్ను చెబుతున్నారు

NTR 30: "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. "జనతా గ్యారేజ్" సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న రెండవ సినిమా గా ఈ చిత్ర షూటింగ్ జూన్ లో మొదలవ్వాలి కానీ ఇప్పటిదాకా సినిమా పట్టాలెక్కలేదు.

దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. లైగర్ సినిమా విషయంలో పూరీకి మరియు బయర్లకి మధ్య జరిగిన జరుగుతున్న గొడవలు చూస్తుంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ మరియు బయర్ల మధ్యలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని కానీ కొరటాల శివ ఈ మ్యాటర్ ను చాలా సైలెంట్ గా మరియు చక్కగా సెటిల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఆచార్య గొడవల వల్ల సినిమా షూటింగ్ కొంత ఆలస్యమైంది. ఆ సమయంలో ఎన్టీఆర్ కూడా "ఆర్ఆర్ఆర్" ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ సినిమా ఆగిపోయిందని బడ్జెట్ కారణంగా సినిమా క్యాన్సిల్ అయిందని కొందరు చెబుతున్నారు. కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదు. అయితే తాజాగా ఈ సినిమాకి అభిమానులు ఒక ఫన్నీ టైటిల్ను చెబుతున్నారు. ఈ సినిమాకి "ఆ ఒక్కటి అడక్కు" అనే టైటిల్ బాగా సెట్ అవుతుందని ఎందుకంటే సినిమా గురించి అడిగిన ప్రతిసారి చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్న జవాబు అదే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories