నవ్వి'తేన'వ్వండి

నవ్వితేనవ్వండి
x
Highlights

నవ్వు నాలుగు విధాల స్వీటే కాదు అన్నిరకాలుగా నూ ఆరోగ్యకారణం కూడానూ. ఎంతో ఒత్తిడితో సతమతమయ్యే మనకు నాలుగు నవ్వు తెప్పించే కబుర్లు వుంటే.. మనసు ఉల్లాసంగా ఉంటుంది.. ఏమంటారు? అందుకే మీ కోసం కొన్ని సరదా జోక్స్..

పంచు పడితే...పళ్ళు రాలాలి

హైదరాబాద్ ఇండోర్ స్టేడియం లో రాష్ట స్థాయి….బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి, చాలామంది క్రీడాభిమానులు ఆ పోటీని తిలకిస్తున్నారు, అందులో...

ఓ వ్యక్తి "మూతి మీద కొడితే దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి" అంటూ కొట్టుకునేవాళ్ళని ఉత్సాహపరుస్తున్నాడు.

అదే ఆట చూస్తున్న మరో వ్యక్తి, ఈ వ్యక్తి మాటలకి ఉండబట్టలేక అడిగాడు.... సర్ మీకు బాక్సింగ్ అంటే అంత ఇష్టమా?

చాలా ఉత్సాహంగా అరుస్తున్నారు? అన్నాడు.

ఉత్సాహము కాదు, ఉసిరికాయ కాదండీ. నేను ఒక డెంటల్ డాక్టర్ ని ఎన్ని పళ్ళు రాలితే నాకు అంత లాభం అంటూ ప్రశాంతంగా చెప్పాడు.

తాయారమ్మ స్పెషల్ కాఫీ

ఆదివారం... ఉదయం టీవీ లో వార్తలు చూస్తున్నాడు రామారావు. అప్పుడే చేతిలో కాఫీ పట్టుకొని వచ్చింది...తాయారమ్మ, ఆ కప్పు కాఫీ ని ఒక సిప్ చేసిన భర్త....

రామారావు : ఏమిటే కాఫీ చేదుగా ఉంది. తాగిన వెంటనే కడుపులో తిప్పుతోంది కూడా అన్నాడు!

తాయారమ్మ: మరేం లేదు. పంచదార డబ్బాలో చీమలు పట్టాయి. చీమలు చావడానికి కొద్దిగా మందు పంచదారలో వేశాను. ఎందుకైనా మంచిదని మందు వేసిన చక్కెరే, మీ కాఫీలో కూడా వేశాను. కడుపులో చీమలుంటే చచ్చిపోతాయిలెండి అంది తాపీగా తాయరమ్మ!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories