Kumbh Mela Monalisa: మహాకుంభమేళా మోనాలిసాకు అదిరిపోయే ఆఫర్

Kumbh Mela Monalisa:  మహాకుంభమేళా మోనాలిసాకు అదిరిపోయే ఆఫర్
x
Highlights

Kumbh Mela Monalisa: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ అందంతో అందర్నీ కట్టిపడేసిన అమ్మాయి మోనాలిసా గురించి...

Kumbh Mela Monalisa: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముతూ అందంతో అందర్నీ కట్టిపడేసిన అమ్మాయి మోనాలిసా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ బ్యూటీ అందాన్ని మెచ్చిన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమెకు తన మూవీస్ లో ఆఫర్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఆమెకు యాక్టింగ్ నేర్పించి మరీ తన సినిమాల్లోకి తీసుకుంటామంటూ చెప్పారు.

మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ పొట్టకూటి కోసం కష్టపడుతున్న మోనాలిసా భోస్లే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన అమ్మాయి. అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె తన తమ్ముడిని చదివించేందుకు ఈ పనిచేస్తున్నట్లు చెప్పింది. కొన్నేళ్లే బాగానే చదువుకున్న ఆమె కుటుంబానికి ఆర్థిక సమస్యలు రావడంతో తమ్ముడి కోసం చదువుకు దూరం కావాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.


చూసేందుకు నల్లగా అద్బుతమైన అందం, అంతకు మించిన కళ్లతో అందర్నీ కట్టి పడేసింది. ఈమెను చూసిన ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ తొలిసారి వీడియో తీసి నెట్టింట్లో వైరల్ చేశాడు. దీంతో ఆమె చిన్నపాటి సెలబ్రిటీ వైరల్ అయ్యింది. కుంభమేళాకు వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆమెను చూసేందుకు పోటీ పడుతున్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకుంటూ వీడియోలు తీస్తూ హంగామా చేస్తున్నారు. ఆమెకు అది నచ్చకపోయినా..అంతా అలాగే చేస్తుండంటంతో ఏం చేయాలో తెలియక అమాయకంగా చూస్తోంది. అయితే ఎవరూ మాట్లాడినా మాత్రం నవ్వుతూనే సమాధానం ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories