Radhe Shyam: "రాధే శ్యామ్" సినిమా లో ఇవే హైలైట్ అవబోతున్నాయట

Fresh Update on Prabhas Radhe Shyam Movie
x

Radhe Shyam: "రాధే శ్యామ్" సినిమా లో ఇవే హైలైట్ అవబోతున్నాయట 

Highlights

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధే శ్యామ్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎప్పుడూ చూడని ఫాంటసీ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 14 జనవరి న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. భారీ పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అందించారని తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం ఈ సినిమాని ఒక అద్భుతమైన థ్రిల్లర్ గా తీర్చిదిద్దారట. అతిముఖ్యంగా ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ కచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉంటాయని సమాచారం. అన్ని విధాలుగా కేర్ తీసుకుని దర్శకనిర్మాతలు ఈ సినిమా కోసం మంచి విజువల్స్ ను అందించారు. సినిమాలో మాత్రమే కాక అటు పాటల్లో కూడా సరికొత్త టెక్నాలజీ వాడి కేవలం విజువల్స్ తో నే ప్రేక్షకులకు కన్నుల విందు చేయబోతున్నారట. టి సిరీస్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణంరాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories