కొడుకు కోసం..

కొడుకు కోసం..
x
Highlights

సాధారణంగా పిల్లల కెరీర్ విషయంలో ప్రతి తండ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇలా చేస్తే బావుంటుంది.. అల అయితే కష్టం.. ఇలా ఎన్నో సలహాలు పిల్లలకు...

సాధారణంగా పిల్లల కెరీర్ విషయంలో ప్రతి తండ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇలా చేస్తే బావుంటుంది.. అల అయితే కష్టం.. ఇలా ఎన్నో సలహాలు పిల్లలకు ఇస్తూ ఉంటారు తండ్రులు. ఒక్కోసారి పిల్లలను విసిగిస్తారు కుడా. తన అనుభవం.. కష్టం తన పిల్లలు పడకూడదనే ఇంత తాపత్రయం పడతారు. ఇక సినిమా తారలైతే తమ పిల్లల్ని సినిమాల్లో హీరోలుగా చేయాలని విపరీతమైన హంగామా చేసేస్తారు. ఇలా ఎందరో తమ వారసుల్ని హీరోలుగా చేయాలని ప్రయత్నించి.. కొందరు సక్సెస్ సాధించారు.. మరికొందరు బోల్తా పడ్డారు.

ఇపుడు తాజాగా హిరో విక్రం తన తనయుడ్ని హీరోగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో తన కొడుకు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ముందు ఈ సినిమాకి వర్మ అని పేరు పెట్టి చాలా వరకు షూటింగ్ పూర్తీ చేశాడు. ఇపుడు ఆ సినిమాకి పేరు మారింది.. మళ్లి తాజాగా షూటింగ్ జరుపుతున్నారు. దీనికి కారణం ఇప్పటివరకు తిసిన సినిమా విక్రంకు నచ్చకపోవడమే అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు తాజాగా సినిమా షూటింగ్ లకు తానూ హాజరవుతున్నాడని చెబుతున్నారు. ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన గిరీశయ్య దర్శకుడు. అయితే మొదటిసారి అవుట్ పుట్ తేడాగా రావడంతో ఈసారి విక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక కంట కనిపెడుతున్నాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా 'ఆదిత్య వర్మ' టీమ్ పోర్చుగల్ కు వెళ్ళిన సమయంలో విక్రమ్ కూడా వారితో పాటు వెళ్ళి షూటింగ్ ఎలా సాగుతుందో గమనించాడట. అంతే కాదు ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరగనుంది.. ఈ షెడ్యూల్ కూడా విక్రమ్ కనుసన్నలల్లోనే జరగనుందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories