ఈ సంవత్సరం నాని డబుల్ ధమాకా

ఈ సంవత్సరం నాని డబుల్ ధమాకా
x
Highlights

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' లాంటి రెండు ఫ్లాపులను చూసిన నాని కొంచెం స్లో అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ స్పీడు పెంచాడు. గ్యాప్ లేకుండా ఒక దాని...

వరుసగా 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' లాంటి రెండు ఫ్లాపులను చూసిన నాని కొంచెం స్లో అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ స్పీడు పెంచాడు. గ్యాప్ లేకుండా ఒక దాని తర్వాత మరొక సినిమాను లైన్లో పెట్టేస్తున్నాడు నాచురల్ స్టార్. ప్రస్తుతం 'జెర్సీ' సినిమా షూటింగ్ను పూర్తి చేసి అమెరికాలో హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తున్న నాని తిరిగి రాగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఐదుగురు హీరోయిన్లతో నాని కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ సినిమా అని కొంతకాలం ప్రచారం సాగింది కానీ ఇంద్రగంటి వేరే ఫ్రెష్ సబ్జెక్టు తో ఈ సినిమా చేయనున్నాడట. దర్శకుడు చెప్పిన లైన్ దిల్ రాజు,నాని కి బాగా నచ్చిందట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయ్యే లోపల ఇంద్రగంటి తన స్క్రిప్ట్ ను పూర్తి చేయనున్నారు. అంటే ఈ సంవత్సరంలో నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక దిల్ రాజు సంక్రాంతి సెంటిమెంట్ తెలిసిందే కాబట్టి నాని-ఇంద్రగంటి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories