ప్రతిరోజూ పండగే ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ప్రతిరోజూ పండగే ఫస్ట్ వీక్ కలెక్షన్స్
x
Highlights

మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. మారుతి దర్శకత్వం వహించగా, మేహరీన్ కథానాయకగా నటించింది. సత్యరాజ్, రావు రమేష్...

మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రతిరోజూ పండగే. మారుతి దర్శకత్వం వహించగా, మేహరీన్ కథానాయకగా నటించింది. సత్యరాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రలలో కనిపించారు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే మంచి స్పందన వచ్చింది. కామెడీ బాగా పండడం,ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వడం , కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సినిమాకి ప్లస్ లు గా మారాయి.

ఈ సినిమాకి పోటిగా రిలీజ్ అయిన దొంగ, రూలర్, దబాంగ్ 3 సినిమాలను తట్టుకొని తొలిరోజు సినిమాకి 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక రెండో రోజు నుంచి కూడా అదే దూకుడు చూపించింది. మొత్తం ఈ చిత్రం వారం రోజుల్లోనే 40 కోట్ల షేర్ అందుకోంది. ఇక రానురాను ఈ చిత్రానికి మరిన్ని వసూళ్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. చిత్రలహరి సినిమా తర్వాత 2019లో మరో హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ సుప్రీమ్ హీరో.

ఇక ఈ సినిమా తరవాత మరో రెండు సినిమాలకి కనెక్ట్ అయ్యాడు తేజు. కొత్త దర్శకుడితో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా గీతా ఆర్ట్స్ లో మరో సినిమాని చేస్తున్నాడు తేజు. త్వరలో సినిమా నుంచి నటినటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories