Mega Star: మెగా స్టార్ భోళా మేనియా షురూ. దుమ్ముదులుపుతున్న మాస్ మసాలా బీట్

Mega Star: మెగా స్టార్ భోళా మేనియా షురూ. దుమ్ముదులుపుతున్న మాస్ మసాలా బీట్
x

Mega Star: మెగా స్టార్ భోళా మేనియా షురూ. దుమ్ముదులుపుతున్న మాస్ మసాలా బీట్

Highlights

మెగాస్టార్ చిరంజీవి..స్టయిలిష్ డైరెకర్ట్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమా భోళా శంకర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతోంది.

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి..స్టయిలిష్ డైరెకర్ట్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో టాలీవుడ్ లో రూపొందుతున్న సినిమా భోళా శంకర్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో శరవేగంగా జరుగుతోంది. మే డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ పోస్టర్స్ లో చిరు వింటేజ్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఇక తాజాగా మొదటి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.

భోళా మేనియా అనే పల్లవితో సాగే మాస్ బీట్ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమో సాంగ్ వింటుంటే ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ అందించేలా మహతి స్వరసాగర్ సంగీతం అందించినట్లు అర్థమవుతోంది. జూన్ 4న విడుదలయ్యే ఫుల్ సాంగ్ మెగా అభిమానులతో పాటు మాస్ బీట్ లవర్స్ ను ఆకట్టుకోవడం ఖాయంలా ఉంది.

భోళా శంకర్ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుండగా చిరు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ కనిపించనుంది. ఇక భోళా శంకర్ షూటింగ్ జూన్ చివరి నాటికి పూర్తి కానుంది. ఏకే ఎంటైర్ టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 11న థియేటర్స్ లోకి రానుంది. వాల్తేరు వీరయ్య వంటి భారీ హిట్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో భోళాశంకర్ పై మెగా అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories