logo

మంటల్లో కాలిపోయిన 'సై రా' సెట్

మంటల్లో కాలిపోయిన
Highlights

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా నరసింహ రెడ్డి'...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా 'సైరా నరసింహ రెడ్డి' సెట్స్ లో మంటలు చెలరేగాయి. కోకాపేటలోని చిరు ఫాంహౌస్ లో సైరా సెట్ నిర్మించారు. ఈరోజు తెల్లవారుజామున అనుకోకుండా ఆ సెట్ లో మంటలు రగిలాయి అని సమాచారం. దాదాపు నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫాంహౌస్ కోకాపేటలో చిరంజీవికి ఉన్నట్లు చెబుతారు. 'సైరా' కోసం కోటతో పాటు సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సెట్స్ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు.

అగ్నిప్రమాదానికి కారణం తెలీదు కానీ, చాలావరకు సెట్ మొత్తం మంటల్లో కాలిపోయింది అని తెలుస్తోంది. కాసేపటికే మంటలు పెద్దవి కావటంతో వాటిని ఆర్పేందుకు అక్కడి సిబ్బంది ప్రయత్నించింది కానీ ఫలించలేదు. సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ మరియు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చల్లార్చినట్టు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.


లైవ్ టీవి


Share it
Top