Samantha: న్యూ ఇయర్ పోస్టుతో కన్నీళ్లు పెట్టిస్తున్న సమంత

Samantha: భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన సమంత

admin1
Updated on: 1 Jan 2022 4:11 PM IST
Fans Tears with New Year post in Samantha | Tollywood News Today
X

న్యూ ఇయర్ పోస్టుతో కన్నీళ్లు పెట్టిస్తున్న సమంత

Samantha: ప్రపంచమంతా కొత్త సంవత్సరం వేడుకలలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. పరిస్థితులు ఎలా ఉన్నా కొత్త సంవత్సరాన్ని అందరూ సంతోషంగా స్వాగతించారు. స్టార్ బ్యూటీ సమంతా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత తనతో విడిపోయిన్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమంత న్యూ ఇయర్ సందర్భంగా పెట్టిన ఒక భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసు ను కలచివేస్తోంది.

"ఈ న్యూ ఇయర్ కి మీ అతిపెద్ద అచీవ్మెంట్ ఇప్పటిదాకా బతికుండడమే అయితే, ఇంకొకరోజు ను చూడాలని అనిపించక పోయినప్పటికీ మళ్లీ నిద్ర లేవడం అయితే, అసలు జీవించటమే అయితే, అది నిజంగానే సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. మన గాయాలన్నీ మనం నయం చేసుకోగలమని నమ్మండి. నీతో మీరు మంచిగా ఉండండి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి చిన్న అడుగు ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇలాంటి విషయంలో మనమందరం కలిసి ఉన్నాం. ఈ 2022 లో అందరం మరింత స్ట్రాంగ్ గా, తెలివిగా ఉండాలని కోరుకుంటున్నాను," అంటూ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

admin1

admin1

Next Story