మహేష్ బాబు లాంటి హీరో అలాంటి సన్నివేశంలో నటించడం ఏంటి అంటున్న అభిమానులు

Fans Talking About How Mahesh Babu Acted in Such a Scene
x

మహేష్ బాబు లాంటి హీరో అలాంటి సన్నివేశంలో నటించడం ఏంటి అంటున్న అభిమానులు

Highlights

*మహేష్ బాబు లాంటి హీరో అలాంటి సన్నివేశంలో నటించడం ఏంటి అంటున్న అభిమానులు

Mahesh Babu Fans: ఒకసారి స్టార్డం వచ్చిన తర్వాత హీరోలు తమ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. ఎంచుకునే కథ కూడా అభిమానులకి నచ్చే విధంగా ప్రతి సన్నివేశం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు స్టార్ హీరోలు. స్టార్డమ్ తో పాటే హీరో లకి బాధ్యత కూడా పెరుగుతూ వస్తోంది. కాబట్టి కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలకు స్టార్ హీరోలు దూరంగా ఉంటారు. కానీ తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కార్ వారి పాట" సినిమా మే 12న విడుదలై హిట్ టాక్ ను అందుకుంది.

సినిమా హిట్టా ఫ్లాపా అనే విషయాన్ని పక్కన పెడితే ఆ సినిమాలో ఉన్న ఒక సన్నివేశం మహేష్ బాబు స్టార్ డమ్ ఉన్న హీరో మీద నెగటివ్ మార్క్ ను క్రియేట్ చేస్తుందని కొందరు చెబుతున్నారు. సినిమా సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు కీర్తి సురేష్ మరియు సుబ్బరాజు కాంబినేషన్లో వచ్చి సన్నివేశాలు కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక సన్నివేశంలో మహేష్ బాబు సుబ్బరాజు పై మూత్రం పోసినట్లుగా సినిమాటిక్ విధానం లో చూపించారు దర్శకుడు.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇలాంటి సన్నివేశాలలో నటించడం ఏమాత్రం బాగోలేదని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇకనైనా మహేష్ బాబు ఇలాంటి సన్నివేశాలకు దూరంగా ఉంటే బాగుంటుంది అని కొందరు చెబుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories