logo
సినిమా

మహేష్ బాబు యాడ్ పై మండిపడుతున్న అభిమానులు

Fans Fires On Mahesh Babu AD | Telugu Movie News
X

 మహేష్ బాబు యాడ్ పై మండిపడుతున్న అభిమానులు

Highlights

*బాలీవుడ్ అఫార్డ్ చేయలేదు కానీ పాన్ మసాలా బ్రాండ్ చేస్తుందా అంటూ మహేష్ బాబు ని ఏకిపారేసిన నెటిజన్లు

Mahesh Babu AD: ఈ మధ్యనే "సర్కారు వారి పాట" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు బాలీవుడ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అడుగు పెట్టే అవకాశం ఏమైనా ఉందా అని మహేష్ బాబు ని అడగగా మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ తనని అఫర్డ్ చేయలేదని చెప్పటం అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది. అయితే సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లలో కూడా అంతే బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు ఒక పాన్ మసాలా బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ నెటిజన్లకు దొరికే సారు.

దీంతో మహేష్ బాబు ని బాలీవుడ్ మాత్రం అఫోర్డ్ చేయలేదు కానీ ఒక పాన్ మసాలా బ్రాండ్ చేయగలదా అంటూ వారిప్పుడు మహేష్ బాబు ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.పైగా ఆ పాన్ మసాలా యాడ్ లో మహేష్ బాబు బాలీవుడ్ లో మంచి పేరున్న టైగర్ స్టాఫ్ తో కలిసి నటించారు. దీంతో బాలీవుడ్ సినిమాలు తనని అఫర్డ్ చేయలేదు అని కామెంట్ చేసే మహేష్ బాబు మళ్లీ అదే బాలీవుడ్ హీరోలతో కలిసి పాన్ మసాలా బ్రాండ్లను ప్రమోట్ చేస్తారా అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్, యశ్ వంటి హీరోలు ఇప్పటికే ఇలాంటి బ్రాండ్లను ససేమిరా ప్రమోట్ చేయమని చెప్పేశారు. మరోవైపు సిగరెట్ తాగే అలవాటు ఉన్న హీరోలు కూడా యువత చెడు దోవ పట్టించడం ఇష్టంలేక అలాంటి యాడ్ లను ప్రమోట్ చేయడం మానేశారు. కానీ మహేష్ బాబు మాత్రం కోసం పాన్ మసాలా యాడ్ లు చేయటం ఏమాత్రం బాగోలేదని అభిమానులు అంటున్నారు.

Web TitleFans Fires On Mahesh Babu AD | Telugu Movie News
Next Story