చిరంజీవి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్న అభిమానులు

Fans are Waiting for Chiranjeevis Comments About Acharya Movie
x

చిరంజీవి కామెంట్లకు ఎదురుచూస్తున్న అభిమానులు

Highlights

*చిరంజీవి కామెంట్లకు ఎదురుచూస్తున్న అభిమానులు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ మధ్యనే విడుదలైన "ఆచార్య" సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ సినిమా విడుదలైన రెండు రోజులకే చిరంజీవి తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోయారు. అమెరికా మరియు యుకే లో దాదాపు నెల పాటు ఉన్న చిరు ఈ మధ్యనే మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చారు. చాలా కాలం తర్వాత చిరంజీవి కెరియర్ లో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ ఈ సినిమా.

ఇక మళ్లీ చిరంజీవి తన తదుపరి సినిమా తో అయినా మంచి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.అయితే దాని కంటే ఎక్కువగా "ఆచార్య" ఫ్లాప్ పై చిరంజీవి ఎలాంటి కామెంట్స్ చేస్తారు అని అభిమానులు ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి సినిమా విడుదలకు ముందు మెగాస్టార్ కూడా సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్గా పాల్గొని సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశారు.

విడుదలకు ముందు చాలా వేదికలపై చిరంజీవి ఆచార్య సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ మెగాస్టార్ ఊహించని అటువంటి విధంగా ఆచార్య డిజాస్టర్గా నిలిచింది. మరి ఇప్పుడు చిరంజీవి సినిమా ఫ్లాప్ పై ఎలా రియాక్ట్ అవుతారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే సినిమా టికెట్ రేట్లు పెంపుదల గురించి కూడా చిరంజీవి మాట్లాడితే బాగుంటుందని కొందరు అంటున్నారు. మరోవైపు చిరంజీవి చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories