New Trend:ట్రెండ్ మారింది గురూ.. హీరోల దగ్గరకే ఫ్యాన్స్..

Fans are Meeting their favorite heroes with a new trend in the industry
x

ట్రెండ్ మారింది గురూ.. హీరోల దగ్గరకే ఫ్యాన్స్..

Highlights

తమ అభిమాన హీరోలను కలుసుకోవాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి. వారిని ఒక్కసారైనా కలుసుకోవాలని అనుకుంటారు అభిమానులు. అలాంటి ఛాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.

New Trend: తమ అభిమాన హీరోలను కలుసుకోవాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి. వారిని ఒక్కసారైనా కలుసుకోవాలని అనుకుంటారు అభిమానులు. అలాంటి ఛాన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పబ్లిక్ ఈవెంట్స్‌లో అభిమాన హీరోలను కలవడం కష్టమే. అందుకే తమ ఫ్యాన్స్‌ను తమ దగ్గరికే పిలిపించుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది.

హీరోలపై ఫ్యాన్స్ ఎనలేని ప్రేమాభిమానాలను చూపిస్తుంటారు. వారి సినిమా విడుదలైదంటే చాలు థియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తారు. ఫస్ట్ షోలో సినిమా చూడడానికి ఎగబడతారు. నిజం చెప్పాలంటే అభిమానులే లేకపోతే హీరోలెక్కడ ఉంటారు చెప్పండి..?

ముఖ్యంగా పుష్ప2 తర్వాత పబ్లిక్ ఈవెంట్స్‌లో ఫ్యాన్స్ కలవడం కదురడంలేదు. అందుకే ఫ్యాన్స్‌నే తమ దగ్గరికి పిలుచుకుంటున్నారు. అప్పట్లో చిరంజీవి నెలలో నాలుగో ఆదివారం ఫ్యాన్స్ కోసం కేటాయించేవారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ‌కూడా అభిమానులతో ముచ్చటించారు. సంబరాల యేటిగట్టు సినిమా సెట్‌లోనే అభిమానులను కలిశారు. యాక్సిడెంట్ తర్వాత ఆయన తరుచుగా ఫ్యాన్స్‌ను కలుస్తున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలో ఫ్యాన్స్‌నే అడిగి తెలుసుకుంటున్నారంట తేజ్. ఇక తేజ్ నటిస్తున్న సంబరాల యేటిగట్టు సెప్టెంబర్ 25న విడుదల కానుంది.

అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రమే కాదు.. ఇటీవల రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్‌ను కలిశారు. కలవడమే కాదు.. వారికి భోజనం కూడా పెట్టి పంపించారంట. ప్రస్తుతం చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం టైంలో వెంకటేష్., ధమాకా విడుదలకు ముందు రవితేజ ఫ్యాన్స్‌తో స్పెషల్ ‌గా మీట్ అయ్యారు.

ఇటీవల కొందరు ఫ్యాన్స్ ఎన్టీఆర్ కోసం కుప్పం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా వచ్చారు. తనను కలుసుకోవాలని అభిమానులు ఎదురు చూస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. వారి కోసం త్వరలో ఓ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు వారి ఆనందమే కాదు సంక్షేమం కూడా తనకు ముఖ్యమన్నారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు క‌ృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. తనను కలుసుకోవడానికి పాదయాత్రలు లాంటివి చేయొద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని అప్పటి వరకు ఓపికగా ఉండాలని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories