పవన్ కళ్యాణ్ విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

Fans are disappointed about Pawan Kalyan
x

పవన్ కళ్యాణ్ విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

Highlights

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైఖరితో కన్ఫ్యూజన్లో అభిమానులు

Pawan Kalyan: కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ "వకీల్ సాబ్" సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. "భీమ్లా నాయక్" సినిమాతో మరొక సూపర్ హిట్ నమోదు చేసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు రాజకీయ పనులతో బిజీ అయ్యారు. జనసేన పార్టీ రాజకీయాలతో పవన్ కళ్యాణ్ బిజీ కానున్నారు. త్వరలో అంటే అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రత్యేక బస్సు యాత్ర చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు పవన్ కళ్యాణ్ బస్ లో ఏపీ మొత్తం తిరగబోతున్నారు. దీంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమా షూటింగులు హోల్డ్ లోకి వెళుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమా తో బిజీగా ఉన్నారు.

అంతేకాకుండా మరొక రీమేక్ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నటుడు మరియు డైరెక్టర్ అయిన సముద్రఖని దర్శకత్వంలో "వినోదయ సితం" సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. మెగా హీరో సాయి తేజ్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న ఒక్క సినిమా కూడా ముందుకు కదిలే లాగా అనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories