హరిహర వీరమల్లు సినిమా గురించి జరిగిన ప్రచారంలో నిజం లేదా?

Fans are disappointed about Harihara Veeramallu
x

హరిహర వీరమల్లు సినిమా గురించి జరిగిన ప్రచారంలో నిజం లేదా?

Highlights

* హరిహర వీరమల్లు విషయంలో నిరాశ చెందుతున్న అభిమానులు

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "హరిహర వీరమల్లు". పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందో అని అభిమానులు కాయలు కాచే లాగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల అవుతుంది అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలు అడియాసలు అయ్యే లాగానే కనిపిస్తున్నాయి.

హరిహర వీరమల్లు సినిమా టీజర్ జనవరి 26న విడుదల అవుతుంది అనే వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ఆఖరికి చిత్ర బృందం కూడా సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటిదాకా సినిమా టీజర్ కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ కూడా లేదు. దీంతో ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం అంతా నిజం అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ విడుదల చేసే ఉద్దేశం చిత్ర బృందానికి ఉందా లేదా అని అభిమానులు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిందా లేదా అని చిత్ర బృందం ప్రకటించలేదు.

ఒకవైపు ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది అని వార్తలు వినిపిస్తుండగానే మరోవైపు పవన్ కళ్యాణ్ తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారని, "హరిహర వీరమల్లు" సినిమా షూటింగ్ కొద్ది రోజులు ఆపేసి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో మాత్రం అభిమానులు ఇంకా గందరగోళం లోనే ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories