విజయ్ సినిమా గురించి వైరల్ అవుతున్న ఫ్యాన్ థియరీలు

Fan Theories About Vijay Movie Are Going Viral
x

విజయ్ సినిమా గురించి వైరల్ అవుతున్న ఫ్యాన్ థియరీలు 

Highlights

* విజయ్ సినిమా ఇలానే ఉండబోతోంది అని చెబుతున్న ఫ్యాన్ థియరీలు

Vijay: విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఇప్పుడు మళ్లీ విజయ్ హీరోగా ఇంకొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే ఈ ప్రాజెక్టు అని అధికారికంగా లాంచ్ చేసింది చిత్ర బృందం. కథ సమాచారం ప్రకారం ఈ సినిమాకి "లియో" అనే ఆసక్తికరమైన టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన కథ గురించి కొన్ని ఫ్యాన్ థియరీ లుఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో కొన్ని ఫ్యాన్ థియరీ లను చూసేద్దామా.

1. ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ లోని ఒక షాట్లో మాస్కులు వేసుకున్న గ్యాంగ్ కార్లో వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఆ మాస్కులు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ టీం వేసుకున్నవి.

2. ఇంకొక షాట్లో కారులో ఇంకొక గ్యాంగ్ వెళుతూ కనిపిస్తుంది. అది రోలెక్స్ గ్యాంగ్ అని చెప్పుకోవచ్చు.

3. టీజర్ లో విజయ్ ఎరిథాక్సీలం (కొకెయిన్) గింజ ను పట్టుకుని కనిపిస్తాడు. విక్రమ్ సినిమాలో కూడా కమల్ హాసన్ దీని గురించి ఒక సీన్ లో మెన్షన్ చేస్తాడు. ఈ సినిమాలో విజయ్ ఎరిథాక్సీలం డీలర్గా కనిపించే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.

4. ఖైదీ సినిమాలో ఒక సన్నివేశంలో కార్తి తాను జైల్లో ఉండే సమయంలో ఒక బేకరీలో మూడు సంవత్సరాలు పనిచేసినట్లు చెబుతాడు. ఇప్పుడు అభిమానులు ఢిల్లీ (కార్తి) మరియు లియో (విజయ్) పాత్రలకు కూడా ఏదో కనెక్షన్ ఉంటుందని అనుకుంటున్నారు.

ఇవన్నీ కేవలం ఫ్యాన్ థియరీలే అయినప్పటికీ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఇంతకీ ఈ ఫ్యాన్ థియరీలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యేదాకా ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories