Manoj Bajpayee: "సలార్" లో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఫ్యామిలీ మ్యాన్

Family Man Fame Manoj Bajpayee Playing Key Role in Prabhas Salaar Movie
x

ప్రభాస్ - మనోజ్ బాజ్పాయి (ఫైల్ ఫోటో)

Highlights

Salaar Movie - Manoj Bajpayee: ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధేశ్యామ్" సినిమా తో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "కే జి ఎఫ్"...

Salaar Movie - Manoj Bajpayee: ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధేశ్యామ్" సినిమా తో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ "కే జి ఎఫ్" సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఒకేసారి తెలుగు మరియు కన్నడ భాషలలో జరగనుంది. "బాహుబలి", "సాహో" వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ మధ్యనే "ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" తో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్పాయి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో మనోజ్ బాజ్పాయ్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడట. ఇక ప్రభాస్ మరియు మనోజ్ బాజపయీ మధ్య జరిగే సన్నివేశాలు సినిమా కి హైలైట్ గా ఉంటాయి అని తెలుస్తోంది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవి బశ్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ "ఆది పురుష్" మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories