Fahadh Faasil: ట్యాక్సీ డ్రైవర్ కావాలని అనుకుంటున్న పుష్ప విలన్.. ఇదేం కోరిక సామీ

Fahadh Faasil
x

Fahadh Faasil : ట్యాక్సీ డ్రైవర్ కావాలని అనుకుంటున్న పుష్ప విలన్.. ఇదేం కోరిక సామీ

Highlights

Fahadh Faasil: భారతదేశంలో సినీ ప్రేక్షకుల అందరికీ ఫహద్ ఫాసిల్ పేరు తెలిసే ఉంటుంది. వాస్తవానికి మలయాళ నటుడైన ఫహద్ ఇప్పుడు భారతదేశంలోని బెస్ట్ యాక్టర్లలో ఒకడు.

Fahadh Faasil: భారతదేశంలో సినీ ప్రేక్షకుల అందరికీ ఫహద్ ఫాసిల్ పేరు తెలిసే ఉంటుంది. వాస్తవానికి మలయాళ నటుడైన ఫహద్ ఇప్పుడు భారతదేశంలోని బెస్ట్ యాక్టర్లలో ఒకడు. అతని నటనకు ఫిదా అవ్వని వాళ్లు లేరు. ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం మలయాళంలోనే కాకుండా చాలా భాషల సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఏ పాత్రనైనా చాలా సులభంగా ఇమిడిపోయే నటుడతడు. చాలా డిమాండ్ ఉన్న యాక్టర్ కాబట్టి, దానికి తగ్గట్టు కోట్లలో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడు. అలాంటి అతడికి ట్యాక్సీ డ్రైవర్‌గా మారాలని ఆశ ఉందట.

చాలా మంది నటులు కెరీర్ చివరి దశకు వచ్చాక ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి, ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయనాయకులుగా సెటిల్ అవుతారు. మరికొందరు సినిమా నిర్మాణ సంస్థలు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఫహద్ ఫాసిల్‌కి మాత్రం నటన నుంచి రిటైర్ అయ్యాక ట్యాక్సీ డ్రైవర్‌గా మారాలనే కోరిక ఉందట. ఈ విషయం అతడే స్వయంగా చెప్పాడు.

2020లో ఫహద్ ఫాసిల్ ఇప్పుడున్నంత పాపులర్ నటుడు కాదు. అప్పుడు ఒక ఇంటర్వ్యూలో అతడు చెప్పినట్లుగా, రిటైర్ అయ్యాక స్పెయిన్‌లోని బార్సిలోనాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేయాలనేది తన కోరిక అని చెప్పాడు. ఇటీవల హాలీవుడ్ రిపోర్టర్ చేసిన ఇంటర్వ్యూలో మళ్ళీ అదే ప్రశ్న అడిగినప్పుడు, "ఇప్పటికీ మీకు అదే కోరిక ఉందా?" అని అడిగితే, ఫహద్ "ఖచ్చితంగా అవును" అని సమాధానం ఇచ్చాడు.

"ఇటీవల కొన్ని రోజుల క్రితం నేను స్పెయిన్‌లో ఉన్నాను. అప్పుడు కూడా నాకు అదే ఆలోచన వచ్చింది. కానీ ప్రజలు నన్ను చూడటం చాలు అనుకున్నప్పుడే నేను ఆ పనికి వెళ్తాను. జోక్ పక్కన పెడితే, ట్యాక్సీ డ్రైవింగ్ ఒక మంచి పని. ఇతరుల ప్రయాణానికి, వారి గమ్యానికి మీరు డ్రైవర్ అవ్వడం, ఇతరులను వారి గమ్యస్థానానికి చేర్చడం ఎంత మంచి పని కదా" అని ఫహద్ ఫాసిల్ చెప్పాడు.

ఫహద్ ఫాసిల్ నటించిన తమిళ సినిమా మారిసన్ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో ఫహద్ దొంగ పాత్రలో నటించాడు. వడివేలు కూడా ఈ సినిమాలో ఉన్నారు. మలయాళంలో ఒదుమ్ కుత్తిర ఇడుమ్ కుత్తిర అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో కరాటే చంద్రన్, పేట్రియాట్ అనే మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. పుష్ప 3, తమిళంలో విక్రమ్ 2 సినిమాల్లో కూడా నటించనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories