"ఎఫ్ 3" లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా!

F3 Movie Actors and Director Remuneration | Tollywood News
x

"ఎఫ్ 3" లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా

Highlights

*"ఎఫ్ 3" లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఎవరికో తెలుసా!

F3 Remuneration: ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు "ఎఫ్2" సినిమా కంటే "ఎఫ్ 3" సినిమా కోసం డబల్ బడ్జెట్ అయిందని చెప్పు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన కారణాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. షూటింగ్ కోసం ఎక్కువ రోజులు పట్టడం మరియు ఎక్కువ మంది ఆర్టిస్టులను సినిమాకోసం తీసుకోవటం, సినిమా బడ్జెట్ ను పెంచిందని కొందరు చెబుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలో సినిమాలో నటిస్తున్న ఎవరికీ ఎక్కువ రెమ్యునరేషన్ లభిస్తుంది అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ సినిమా కోసం ఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్నా ఈ సినిమా కోసం రెండు కోట్లు తీసుకోగా, మెహరీన్ కోటి రూపాయలు చార్జి చేసిందట.

ఇక ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఏకంగా మూడు కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరందరి కంటే ఎక్కువగా చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా కోసం 15 నుంచి 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా చవిచూడని అనిల్ రావిపూడి తన రెమ్యూనరేషన్ బాగానే పెంచేసినట్లు అర్థం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories