Wild Dog: ప్రతీ భారతీయుడు గర్వంగా చూడాల్సిన సినిమా 'వైల్డ్ డాగ్': చిరంజీవి

Every Indian Must Watch Wild Dog Movie says Mega Star Chiranjeevi
x

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున (ఫొటో ట్విట్టర్)

Highlights

Wild Dog: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించిన సినిమా 'వైల్డ్ డాగ్'.

Wild Dog: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహించిన సినిమా 'వైల్డ్ డాగ్'. గత వారం విడుదలైన ఈ సినిమాకు మౌత్ టాక్ బాగానే వచ్చింది. కానీ, కలెక్షన్స్ లో మాత్రం వెనుకపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' రెండో రోజు కేవలం రూ. 64 లక్షల షేర్ రాబట్టగలిగిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తొలిరోజు ఈ సినిమాకు రూ. 1.21 కోట్ల షేర్ వచ్చిన విషయం తెలిసిందే. అంటే రెండో రోజు కలెక్షన్లు 50 శాతం పడిపోయాయి.

కాగా, ఈ సినిమాకు బూస్ట్ ఇచ్చాడు మోగాస్టార్ చిరంజీవి. సినిమా చూసిన ఆయన టీంను, కింగ్ నాగార్జునను పొగడ్తలతో ముంచెత్తాడు. ఈమేరకు ట్విట్టర్ లో తన అభిష్రాయన్ని షేర్ చేశాడు మెగాస్టార్. దీంతో వైల్డ్ డాగ్ టీం సంతోషంలో మునిగిపోయింది. చిరంజీవి ఏమన్నారంటే... "ఇప్పుడే #WildDog చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా.. ..చూపించిన నా సోదరుడు @iamnagarjuna వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు #Solomon, నిర్మాత #NiranjanReddy లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్ #WildDog ! వాచ్ ఇట్ !!" అని ట్వీట్ చేశాడు.

ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు కిరణ్ కుమార్ మాటలు అందించాడు. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా హిందీ భామ దియా మీర్జా హీరోయిన్‌గా నటించిగా.. సయామీ ఖేర్ మరో ముఖ్యపాత్రలో కనిపించింది. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా కూడా మరో కీలకపాత్ర పోషించాడు.

వైల్డ్ డాగ్‌కు 8.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా 9.4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 7.3 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటేనే హిట్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తే... వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలేలా ఉందని ట్రేడ్ టాక్.


Show Full Article
Print Article
Next Story
More Stories