Kamakshi Bhaskarla: తేళ్లు, బొద్దింకలు తిన్నా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్

Even Ate Scorpions and Cockroaches Kamakshi Bhaskarla
x

తేళ్లు, బొద్దింకలు తిన్నా.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్

Highlights

డాక్టర్లుగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి తన గురించి, తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Kamakshi Bhaskarla: ఇండస్ట్రీలో మనకు ఎక్కువగా వినిపించే మాట.. డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయ్యాను అని. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు. కానీ డాక్టర్లుగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో కామాక్షి భాస్కర్ల ఒకరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి తన గురించి, తన ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేసిన ఈ తెలుగమ్మాయి కొన్నాళ్ల తర్వాత వైద్య వృత్తిని వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మా ఊరి పొలిమేర చిత్రంతో నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. విరూపాక్షి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, పొలిమేర2 లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి తనదైన నటనతో ఆకట్టుకుంది.

అయితే కామాక్షి నటిగానే అందరికీ తెలుసు. ఆమె డాక్టర్ అని, ఆరేళ్ల పాటు చైనాలో ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. తాను చైనాలో ఉన్న సమయంలో గదిలో తానే వంట చేసుకునేదాన్నని.. అయితే చైనా ఫుడ్ రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒకటి రెండు సార్లు ఆ ఫుడ్ తిన్నానని చెప్పారు. బొద్దింకలు, తేళ్లు వంటివి రుచి చూశానని చెప్పుకొచ్చారు కామాక్షి.

తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి వంటకాలు ట్రై చేస్తానని.. అందులో భాగంగానే చైనా ఫుడ్ తిన్నానని చెప్పారు. అంతేకాదు చైనా వాళ్లు, తేళ్లు, బొద్దింకలు, పాములు ఎందుకు తింటారో కూడా వివరించింది. కొన్నేళ్ల క్రితం చైనాలో మనలాగా గ్రీనరీ ఉండేది కాదనీ తినడానికి కూరగాయలు దొరకని పరిస్థితుల్లో కనిపించిన జీవుల్ని చంపి తినడం అలవాటైందని చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories