Evaru Meelo Koteeswarulu: ఈఎంకే రూమర్లకు చెక్!

Evaru Meelo Koteeswarulu Latest Promo
x

ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Evaru Meelo Koteeswarulu: 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను కొద్దిరోజుల క్రితం ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Evaru Meelo Koteeswarulu: 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను కొద్దిరోజుల క్రితం ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హెూస్ట్‌గా వ్యహరించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో మే చివరి వారం నుంచి జెమిని టీవీలో ప్రసారం కావాల్సిఉంది. అయితే గతకొద్ది రోజులుగా ఈ షోపై కొన్ని రూమర్లు వస్తున్నాయి. కరోనాతో ఈ షో షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది ఈ షో టెలికాస్ట్‌ కాదనే రూమర్లు ప్రచారం అవుతున్నాయి.

ఈ మధ్యలో ఎన్టీఆర్ కి కూడా కరోనా వచ్చి, తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రూమర్లకు బలం చేకూరినట్లైంది. కరోనా ఉధృతి తగ్గగానే ఎన్టీఆర్‌ ఇంతకు ముందు కమిటైన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఈ షోకి డేట్స్‌ సర్థుబాటు చేసుకోవడం కుదరదని, అందుకే ఈ షో వాయిదా పడపనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు జెమిని టీవీ తాజాగా ఓ ప్రోమో వదిలింది. దీంతో ఈ షోపై వస్తున్న రూమర్లకు చెక్‌ చెప్పినట్లైంది. త్వరలోనే ఈ షో మొదలకాబోతున్నట్లు ప్రోమో తో తెలియజేసింది. దీనిలో 'ఈఎమ్‌కే ఆడుతున్న వారి కలలను నెరవేరుస్తుంది. ఇటు చూస్తున్న వారికి వంద శాతం వినోదాన్ని అందజేస్తుంది​'అని ప్రోమోని విడుదల చేసింది. అయితే ఈ షో ఎప్పటి నుంచి మొదలవుతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories