ఎంత మంచివాడవురా క్లోజింగ్ కలెక్షన్స్

ఎంత మంచివాడవురా క్లోజింగ్ కలెక్షన్స్
x
Highlights

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ఎంత మంచివాడవురా.. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు...

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ఎంత మంచివాడవురా.. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ బ్యానర్ పై సుభాష్ గుప్తా, ఉమేష్ ఉప్తా కలిసి నిర్మించారు.ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మేహరీన్ హీరోయిన్ గా నటించింది. సినిమాకి మొదటి ఆట నుంచి మిక్సుడ్ టాక్ వచ్చింది. కానీ కొత్త కళ్యాణ్ రామ్ ని ఈ చిత్రంలో చూపించారని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

సినిమా టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన రావడంతో సినిమాపైన మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు సంక్రాంతి రోజు రిలీజ్ కావడంతో మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇక ఈ సినిమాకి పోటిగా వచ్చిన మహేష్, బన్ని సినిమాలకి మంచి టాక్ రావడంతో ఆ తర్వాత కలెక్షన్లు బాగా డల్ అయ్యాయి..

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.5 కోట్లు

♦ సీడెడ్ – 83 లక్షలు

♦ గుంటూరు – 65 లక్షలు

♦ ఉత్తరాంధ్ర – 82 లక్షలు

♦ తూర్పు గోదావరి – 95 లక్షలు

♦ పశ్చిమ గోదావరి – 62 లక్షలు

♦ కృష్ణా – 58 లక్షలు

♦ నెల్లూరు – 23 లక్షలు

♦ మొత్తం షేర్ – 6.18 కోట్లు

♦ రెస్ట్ అఫ్ ఇండియా + ఓవర్సీస్ – 20 లక్షలు

♦ వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్ – 6.38 కోట్లు

ఈ సినిమా విడుదలకి ముందు థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక క్లోజింగ్ కలెక్షన్ల సరికి ఈ చిత్రం 6.94 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి 5.1 కోట్ల నష్టం వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కళ్యాణ్ రామ్ త్వరలో ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories