ఎంతమంచివాడవురా! మొదటి రోజు కలెక్షన్స్

ఎంతమంచివాడవురా! మొదటి రోజు కలెక్షన్స్
x
Highlights

ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ , మెహరీన్‌ జంటగా నటించిన సినిమా ఎంతమంచివాడవురా!.

సంక్రాంతి సందర్భంగా విడుదలైన అన్ని చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఒక సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ దర్బార్, మహేష్ సరిలేరు నీకెవ్వరు, బన్ని అల వైకుంఠపురంలో.. ప్రేక్షకులను మెప్పించాయి. మూడు వైవిద్యభరితమైన చిత్రాలు కావడంతో సినీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.

ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌ , మెహరీన్‌ జంటగా నటించిన సినిమా ఎంతమంచివాడవురా!. 'శతమానం భవతి' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్‌ వేగేశ్న డైరెక్షన్ చేశారు. MLA, నా నువ్వే, 118 లాంటి వరుస పరాజయాల తర్వాత ఎంతమంచివాడవురా!తో కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.‎ సతీష్ వేగేశ్నశ్రీనివాస కళ్యాణం పరాజయం తర్వాత దర్శకుడు ఈ సినిమాను ప్రెస్టేజ్‌గా తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో నందమూరి హీరో నటించిన ఎంతమంచివాడవురా సినిమాకు బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకలకు భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో మొదటి రెండు షోలు హౌస్ ఫుల్ కలెక్షన్లతో థీయేటర్లు నిండిపోయాయి. అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంతో ఈ సినిమా విఫలమైయింది. ఈ చిత్రానికి తాజాదనం లేకపోవడం, స్క్రీన్ ప్లేలో ఎటువంటి ఆకట్టుకోలేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రంపై ఆసక్తి చూపకడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రం చాలా ప్రాంతాలలో సగటు థీయేటర్లు నిండలేదు పైగా పబ్లిక్ టాక్ కూడా సానుకూలంగా లేకపోవడం ఒక కారణమతే, విమర్శకులు కూడా ఈ చిత్రాన్ని తక్కువ రేటింగ్ ఇవ్వడంతో ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే సినిమా ఓపెనింగ్స్ పెద్ద లేవు, సినిమా లాభాల్లో బయటపడుతుందో లేదో చూడాలంటే సంక్రాంతి సెలవులు అయిపోతేగానీ తెలియదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories